ప్రస్తుతం టెలివిజన్ తెరపై భారీ స్థాయి రేటింగ్స్ తో పాటు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ తో కొనసాగుతున్న రోజుల్లో బిగ్ బాస్ షో కూడా ఒకటి అని చెప్పక తప్పదు. కొన్నేళ్ళ క్రితం తొలిసారిగా స్టార్ మా ఛానల్ లో టాలీవుడ్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్బాస్ సీజన్ 1 ప్రారంభమైంది. ఆ సీజన్లో శివ బాలాజీ విజేతగా నిలవగా తదుపరి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా తెరకెక్కిన సీజన్ 2 లో కౌశల్ మందా, అలానే ఆపై నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ ఇక మరొకసారి నాగార్జున నేతృత్వంలోని రూపొందిన బిగ్బాస్ సీజన్ 4 ఇటీవల ప్రసారమవ్వగా, ఆ సీజన్లో అభిజిత్ దుద్దాల విజేతగా నిలిచాడు.

ఇది ఈ ఏడాది కూడా అతి త్వరలో తదుపరి సీజన్ 5 ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ తాజా సీజన్ కి సంబంధించి పలువురు కంటెస్టెంట్స్ ఎంపికని బిగ్బాస్ టీమ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సీజన్ల కంటే కొంత భిన్నంగా సీజన్ 5 లో కొందరు నార్మల్ ఆడియన్స్ ని కూడా తీసుకోబోతున్నారు అని అంటున్నారు. ఆ విషయం అటుంచితే మరొకసారి ఈ తాజా సీజన్ 5కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారు అనే వార్త కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. ఇప్పటికే రెండు సీజన్స్ లో అదరకొట్టిన నాగార్జున అయితేనే తాజా 5వ సీజన్ ని కూడా బాగా హ్యాండిల్ చేయగలరనే భావించిందట బిగ్బాస్ యూనిట్.

నిజానికి ఈ సీజన్ కోసం మొదట నాగార్జునని అప్రోచ్ అయిన యూనిట్, ఆయన చేస్తానని ఒప్పుకోవడంతో ఆనందం వ్యక్తం చేసిందట. అయితే అతి త్వరలో బంగార్రాజు అలానే ప్రవీణ్ సత్తారు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనటానికి బిజీ షెడ్యూల్ ఉండడంతో ఆయన బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్ లేదని, అందుకే ఆయన స్థానంలో మరొక యువ నటుడి ని తీసుకునేందుకు బిగ్ బాస్ టీమ్ ప్రస్తుతం ఆసక్తి చూపుతోందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్తలో  ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: