శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ మూవీ తో నటుడిగా మంచి పేరు దక్కించుకున్న యువ నటుడు నిఖిల్ సిద్దార్ధ, ఆ తరువాత పరశురామ్ తీసిన యువత, సుధీర్ వర్మ తెరకెక్కించిన స్వామి రారా, అలానే చందూ మొండేటి తీసిన కార్తికేయ సినిమాల సక్సెస్ లతో ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ దక్కించుకున్నారు. 2016లో విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సూపర్ హిట్ నిఖిల్ కెరీర్ కి పెద్ద బ్రేక్ నిచ్చింది. ఇక ఇటీవల కేశవ, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ ప్రస్తుతం 18 పేజస్, కార్తికేయ 2 సినిమాలు చేస్తున్నారు.

అయితే వీటిలో 18 పేజస్ సినిమాని గీత ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. వైవిధ్యమైన కథనాలతో ఒక డిఫరెంట్ స్టోరీ తో రాబోతున్న ఈ సినిమాలో హీరో నిఖిల్ పాత్ర యువతని ఎంతో ఆకట్టుకుంటుందని సమాచారం. యువ దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తీస్తున్న ఈ సినిమాకి గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక నేడు ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ని కొద్దిసేపటి క్రితం యూనిట్ రిలీజ్ చేసింది.

హీరో నిఖిల్ నోట్లో సిగరెట్ పెట్టుకుని చేతిలో కాలుతున్న పేపర్ పట్టుకుని ఉన్న ప్రీ లుక్ పోస్టర్ ఒకింత ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు సినిమాపై ఆడియన్స్ లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా జూన్ 1 న నిఖిల్ జన్మదినం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆల్మోస్ట్ చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకోగా దీనిని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకుస్తాం అని అంటోంది యూనిట్ ..... !!    

 

మరింత సమాచారం తెలుసుకోండి: