నెల్లూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినిమా క్రిటిక్ కత్తి మహేష్ కు తీవ్రగాయాలైన సంగ‌తి మనకు తెలిసిందే. ప్రస్తుతం క‌త్తి మ‌హేష్ చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. తలకు బలమైన గాయాలు కావడం వల్ల ప్రాణాపాయం ఏమైనా ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ  వైద్యులు అతనికి ప్రాణాపాయం ఏమీ లేదని రోజురోజుకు కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే తలగాయం కొద్దిగా తగినట్లుగా ముక్కుకి, నుదిటి ఎముకకు శస్త్ర చికిత్సలు పూర్తయినట్టు గా డాక్టర్లు తెలిపారు. కంటికి బలమైన గాయాలు కావడం వల్ల  శంకర కంటి ఆసుపత్రి వైద్యులు పలు దఫాలుగా పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా కొన్ని  శస్త్రచికిత్స లు కూడా చేశారు. 

ఇక కంటి చూపు కి ఎలాంటి ప్రమాదం లేదని వారు నిర్ధారించారు. ఇదిలా ఉంటే కత్తి మహేష్ కి యాక్సిడెంట్  జరిగినప్పటి నుండి  కొంత‌మంది అతను చనిపోవాలని...తలకు కళ్ళకు గాయాలు కావడం వల్ల క‌త్తి మ‌హేష్ చావు దార‌ణ‌మైన‌ రీతిలో ఉంటుందని అంటూ అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియా వేదికగా చేయడం జరిగింది. అలాంటి వార‌కి కొంత‌మంది సపోర్ట్ చేస్తూ ఉండ‌గా మ‌రి కొంద‌రు తీవ్రంగా వ్య‌తిరేఖిస్తున్నారు. కత్తి మహేష్ రోజు రోజుకు కోరుకుంటున్నా కూడా  అత‌డు మ‌ర‌ణించాడ‌ని కొంద‌రు....కండ్లు పోయాయ‌ని మ‌రి కొంద‌రు కామెంట్స్ ,పోస్టులు పెడుతున్నారు. కాగా దీనిపై ఐపీఎస్ ఆఫీసర్... ఆంధ్రప్రదేశ్ సిఐడి అదనపు  డీజీ పివి సునీల్ కుమార్ రియాక్ట్ అయ్యారు.

అంతే కాకుండా కామెంట్లు చేస్తున్న‌వారికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే కనీస మానవత్వం విలువలు లేకుండా అతను చనిపోవాలి అంటూ కోరుకోవడం అమానుషమ‌ని అన్నారు. అదే మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఇలాగే ఆలోచిస్తారా..? అంటూ ప్ర‌శ్నించారు. సాటి మనుషులుగా ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్నపుడు సానుభూతి చూపించాలని. అంతే తప్ప అతడి నిస్సహాయ స్థితి ఎవరికైనా సంతోషం కలిగించింది అంటే ఆ తప్పు వారిది కాదని అన్నారు. ఏది తప్పో ఏది ఒప్పో తెలీకుండా వాళ్ళని అలా పెంచి సమాజం మీదకి వ‌దిలిన తల్లితండ్రులదని అన్నారు. తనను విమర్శించిన వ్యక్తిపై దాడి జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చిన గొప్ప మానవతా వాది చిరంజీవి.... ఆయ‌న‌ లాంటి వారి నుండి ఆ మానవత్వం నేర్చుకోవాలంటూ స‌లహా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: