విద్యుత్ అనేది మనిషి జీవితంలో ఎన్ని మార్పులకు కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చీకటి మాటున బతుకుతున్న మనిషి జీవనశైలిని వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ క్రమం లోనే నేటి రోజుల్లో ప్రతి అవసరం లో కూడా విద్యుత్ వినియోగం పరిపాటిగా మారి పోయింది. ఇక విద్యుత్తు లేదు అంటే నేటి రోజుల్లో ఎన్నో రకాల పనులు ఆగిపోతాయి. ఒకరకంగా మనిషి జీవనం పూర్తిగా స్తంభించిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


 ఒకరకంగా విద్యుత్ లేకపోతే ప్రస్తుతం 90 శాతం పనులు కూడా ఆగిపోతాయి అని చెప్పాలి. అయితే ఇలా మనిషి జీవనశైలిని ఎంతో సులభతరంగా ఎంతో సౌకర్యవంతంగా మార్చేసిన విద్యుత్ విషయంలో మాత్రం అదే మనుషులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఏమాత్రం ఆటలాడిన చివరికి ప్రాణాలను గాల్లో కలిసిపోతూ ఉంటాయి. ఇలా విద్యుదాఘాతం తో చనిపోతున్న వారి సంఖ్య నేటి రోజుల్లో ఎక్కువైపోతూనే ఉంది. అయితే సాధారణంగా విద్యుత్ షాక్ తగిలింది అంటే చాలు తీవ్ర గాయాలు అవుతాయి. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.


 కానీ ఇక్కడ యువకుడు విషయం లో మాత్రం అలా జరగడం లేదు. సాధారణం గా విద్యుత్ వైర్ తగిలితేనే షాప్ తగిలి గాయాలు అవడం ఇప్పటి వరకు చూసాం. కానీ ఇక్కడ యువకుడు మాత్రం విద్యుత్ వైర్లను నోట్లో పెట్టుకున్న కూడా అతనికి ఏమవ్వడం లేదు. అంతేకాదు ఇక  అతని ఒంటినిండా విద్యుత్ పాస్ అవుతూ ఉండడం గమనార్హం. ఇలా కరెంటు వైర్లు నోట్లో పెట్టుకున్న ఆ కుర్రాడు మాత్రం మామూలుగానే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇది చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఐరన్ మ్యాన్, సూపర్ మాన్ లాగా అతను ఎలక్ట్రికల్ మ్యాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: