దాదాపు రెండు నెలల నుంచి క్రికెట్ ప్రేక్షకులు అందరినీ కూడా అలరిస్తూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ఇక 2024 ఐపీఎల్ సీజన్లో విజేత ఎవరు అన్న విషయం తేలిపోతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇక భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే 2016లో ఐపిఎల్ టైటిల్ అందుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎన్నో ఏళ్ల నుంచి కేవలం లీగ్ దశకు మాత్రమే పరిమితమవుతుంది. కొన్ని కొన్ని సార్లు కష్టపడి ప్లే ఆఫ్ లో అర్హత సాధించినప్పటికీ చివరికి కప్పు కొట్టడంలో మాత్రం వెనుకబడిపోతూనే ఉంది. అయితే ఈసారి మాత్రం బ్యాటింగ్లో బౌలింగ్లో పటిష్టంగా కనిపిస్తున్న సన్రైజర్స్.. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇక మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ రెండవ క్వాలిఫైయర్ లో మాత్రం విజయం సాధించి మరోసారి కోల్కతాను ఫైనల్ మ్యాచ్లో ఢీ కొట్టేందుకు రెడీ అయింది.


 దీంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ జట్టు విజేతగా నిలుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే కమిన్స్ గత ఏడాది ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ గెలిపించినట్లుగానే ఈసారి సన్రైజర్స్ కు టైటిల్ గెలిపిస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కమిన్స్ గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో ది టెస్ట్ మూడవ సీజన్లో కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిపోయాయ్. మా అమ్మ చెప్పిన మాటనే నేను ఎప్పుడూ అనుసరిస్తాను. ప్యాట్.. వెళ్ళు ప్రపంచాన్ని జయించు. అక్కడ ఎవరో ఒకరు అద్భుతాన్ని చేస్తారు. అది నువ్వే కావచ్చు అంటూ చెబుతుంది. మా తల్లి చెప్పిన మాటను ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ముందుకు సాగుతా అంటూ ప్యాట్ కమిన్స్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl