ఇండస్ట్రీలోని హీరోలు అంతా పాన్ ఇండియా మూవీలలో నటించడమే అంతిమ ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక హిట్ కూడ కొట్టని అఖిల్ కూడ పాన్ ఇండియా మూవీ వైపు అడుగులు వేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

వరస పరాజయాలతో సతమతమైపోతున్న అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తో తన కెరియర్ ఒక టర్న్ తిరుగుతుందని అఖిల్ భావిస్తున్నాడు. అయితే కరోనా వేవ్ లు అడ్డుతగులుతూ ఉండటంతో ఈమూవీ ఎప్పుడు విడుదల అవుతుందో అఖిల్ కు తెలియని పరిస్థితి. మరొక వైపు ఈ మూవీ ఓటీటీ బాట పడుతుందని వస్తున్న వార్తలు అఖిల్ కు మరింత టెన్షన్ కలిగిస్తున్నాయి.

దీనితో ఇక అఖిల్ సురేంద్ర రెడ్డితో చేయబోతున్న మూవీ పైనే తన ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం అఖిల్ సురేంద్ర రెడ్డిల మూవీ ప్రాజెక్ట్ లో మమ్ముట్టి ఎంటర్ కావడం సంచలనంగా మారింది. సుమారు మూడు కోట్లు పారితోషికం ఇచ్చి ఈమూవీలో ప్రత్యేక పాత్రను చేయడానికి మమ్ముట్టిని ఒప్పించారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మలయాళంలో మమ్ముట్టి పెద్ద స్టార్ హీరో కానీ ఈ మధ్యకాలంలో అతడి హవా కాస్త తగ్గింది. ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోవడమే కాకుండా అతని మార్కెట్ కూడ పూర్తిగా పడిపోయింది అన్న మాటలు వస్తున్నాయి.

ఈ సంవత్సరం ఆయన నటించిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశ పరిచడంతో మమ్ముట్టి మార్కెట్ మరింత తగ్గిపోయింది. అయినప్పటికీ ఆయనకి మూడు కోట్లు ఇవ్వడానికి అఖిల్ ‘ఏజెంట్’ టీమ్ రెడీ కావడం హాట్ న్యూస్ గా మారింది. సురేందర్ రెడ్డి తన సినిమాలను ఎంతో స్టైలిష్ గా రిచ్ గా తీస్తాడు అన్న పేరు ఉంది. ఇప్పుడు ఈమూవీలో మమ్ముట్టి కూడ వచ్చి చేరడంతో ఈమూవీ మార్కెట్ పెరిగి పాన్ ఇండియా మూవీ ఇమేజ్ కి చేరుకుంటుందని నిర్మాతల వ్యూహం. ఈమూవీ కోసం అఖిల్ చాల కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేసుకున్న విషయం తెలిసిందే..



మరింత సమాచారం తెలుసుకోండి: