మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తన మాతృ బాషతో పాటు, ఇటు తెలుగు అటు తమిళ్ భాషల్లోనూ నటుడిగా మంచి గుర్తింపు పొందారు. దుల్కర్ సూపర్ హీరో మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి తనయుడు అన్న విషయం తెలిసిందే. ఇతను కేరళలోని  కొచ్చిలో  జూలై 28, 1986 లో జన్మించారు. అయితే మహానటి సినిమా తర్వాత దుల్కర్ కి తెలుగు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది. ఈ  హీరో నటనను చూసి ముగ్ధులైన ప్రేక్షకులు దుల్కర్ ప్రతిభకు ఫిదా అయ్యారు. దాంతో ఒక్కసారిగా మహానటి చిత్రం తర్వాత  టాలీవుడ్ లో దుల్కర్ కి క్రేజ్ అమాంతం రెట్టింపయ్యింది. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు ఈ హీరో.  అయితే మొదట ఈ హీరో డైరెక్టర్ అవ్వాలని అనుకున్నారట. అయిదవ తరగతి పూర్తయ్యాక తన తండ్రి ముమ్మటి దగ్గర నుండి ఒక కెమెరా తీసుకుని ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశారట. ఆ షార్ట్ ఫిల్మ్ ని తానే స్వయంగా డైరెక్ట్ చేశాడు. 

అయితే తన తండ్రి డైరెక్టర్ అయితే రిస్క్ ఎక్కువ, సో హీరో అయితే నీకా టెన్షన్ ఉండదు అనడంతో....తండ్రి కోరిక మేరకు హీరోగా మారాలని డిసైడ్ అయ్యారట దుల్కర్ సల్మాన్. అలా మమ్ముట్టి తనని ముంబై లోని మేరీ జాన్ యాక్టింగ్ స్టూడియోలో చేర్పించగా, నటనలోనూ మెళుకువలు తెలుసుకున్నాడు దుల్కర్. సెకెండ్ షో సినిమాతో మోలీవుడ్ లో హీరో గా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ మొదటి సినిమాతోనే సక్సెస్ ను అందుకొని నటుడిగా మంచి మార్కులే కొట్టేసాడు. ఉత్తమ నూతన నటుడు గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో దుల్కర్ సరసన హీరోయిన్ గా చేసిన గౌతమి నాయర్ ని ఈ చిత్ర దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం మాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇక మహనటి సినిమాలో అయితే మొదట జెమిని గణేశన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను సెలెక్ట్ చేశారు. అయితే ఒక  తమిళ వ్యక్తి తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ స్లాంగ్ విజయ్ దేవరకొండ స్వరానికి అంతగా నప్పక పోవడంతో ...ఆ ప్లేస్ లో దుల్కర్ సల్మాన్ ని తీసుకున్నారు.

ఈ మూవీలో దుల్కర్ నటనకు 100 కి 100 మార్కులు పడ్డాయి. ఈ మూవీకి దుల్కర్ సల్మాన్ ఎంతగా పాపులర్ అయ్యాడో అదే విధంగా ఈ సినిమా దుల్కర్ కెరియర్ కి కూడా ప్లస్ అయ్యింది. ఈ సినిమాతో  సౌత్ ఇండియా మొత్తం ఫుల్ ఫేమస్ అయిపోయారు. ఎనిమిది సంవత్సరాల కెరియర్ లోనే ముప్పై సినిమాలకు పైగా నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక  ముద్ర వేసుకున్నాడు ఈ హీరో. అనతి కాలంలోనే హీరోగా గొప్ప గుర్తింపు సంపాదించాడు దుల్కర్ సల్మాన్. అయితే నేడు మన అభిమాన  హీరో దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.

మరింత సమాచారం తెలుసుకోండి: