
తాజాగా ఈమె పై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు అనగా ఆగస్టు 14వ తేదీన కేరళలోని క్రైమ్ బ్రాంచ్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇకపోతే మీరాను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో , ఆమె గట్టిగా అరుస్తూ పోలీసులు తనను వేధించడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఆరోపించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోలో పోలీసులు తన ఫోన్ ఇవ్వమని కోరడాన్ని కూడా మనం స్పష్టంగా వినవచ్చు.
ఇకపోతే మీరా ను అరెస్ట్ చేయడానికి కొంత సమయం ముందు, ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈమె కులతత్వ దూషణలకు పాల్పడిందని అరెస్ట్ చేయడం జరిగింది.. ఈమెపై విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు పిటిషన్ మేరకు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మీరా అరెస్ట్ అయ్యే ముందు గట్టిగా అరవడం అలాగే ఏడుస్తున్న వీడియో ను ఆన్లైన్లో చూడవచ్చు.. ఆమె కేరళలో తన గదిలో ఉన్నప్పుడు పోలీసులు తనను అరెస్టు చేసి వేధించడానికి ప్రయత్నించారని ఆమె చెప్పుకొచ్చింది.. ఆమె పై పోలీసులు చేయి వేస్తే చంపేస్తాను అని కూడా బెదిరించింది.
అంతేకాదు ఈమె తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తో పాటు ప్రధానమంత్రినరేంద్ర మోడీ కి కూడా తన విజ్ఞప్తి చేయడం ఈ వీడియో ద్వారా చూడవచ్చు.