సహజమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న స్టైలిష్ హీరో నాని. అందుకే ఈయన్ను న్యాచురల్ స్టార్ అంటూ నీరాజనాలు పలుకుతున్నారు తెలుగు ఆడియన్స్. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 'అష్టా చమ్మ' చిత్రంతో హీరోగా మారిన నాని తొలి చిత్రంతోనే ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక అప్పటి నుండి వరుస చిత్రాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. వెండి తెరపై ఎన్నో ప్రేమాయణాలు మనకు పరిచయం చేసిన ఈ హీరో నిజ జీవితం లో కూడా అంతే గొప్ప ప్రేమాయణం ఉంది. ఈ హీరో అంజన అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈమె తండ్రికి విజయనగరంలో ఒక ఫ్యాక్టరీ ఉంది.

ప్రస్తుతం అంజన కాస్ట్యూమ్స్ డిజైనర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. 2012 లో పెళ్లి బంధంతో ఒకటైన ఈ జంటకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే సినిమాలలో లాగే రియల్ లైఫ్ లో కూడా నాని లవ్ స్టొరీ లో చాలా ట్విస్ట్లు ఉన్నాయంట.  ఓ ప్రముఖ షోలో పాల్గొన్న నాని, అంజనల జంట ఆనాటి వారి ఆ మధుర ప్రేమ  జ్ఞాపకాలను చెప్పుకొచ్చింది. ఆ షోలో పాల్గొన్న వీరు వారి ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర అంశాలను షేర్ చేసుకున్నారు. తాజాగా ఆ షోకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.  

వీరి ప్రేమ గురించి హీరో నాని మాట్లాడుతూ అంజన నేను అయిదేళ్లుగా ఫ్రెండ్స్ గా ఉన్నాము. ఎందుకో తెలియదు కానీ సడెన్ గా తనపై ప్రేమ పుట్టింది, అంతే వెంటనే ప్రపోజ్ చేసేసాను అన్నారు. కానీ ఈ హీరో అందరిలా మొదట లవ్ ప్రపోజ్ చేయలేదు...డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందామా అని ప్రపోజ్ చేశారట. దాంతో అంజన షాక్ అయ్యారట...ఆ తరవాత ఎలాగోలా మొత్తానికి ఒప్పిస్తే మళ్ళీ ఇంట్లో ఇరు కుటుంబాలను ఒప్పించడం మరో ఛాలెంజింగ్ రౌండ్ అట. అలా చివరికి ఇరు కుటుంబాలకు ఒప్పించి పెళ్లి బంధంతో ఒకటయింది ఈ ప్రేమ జంట.

మరింత సమాచారం తెలుసుకోండి: