నిన్నటిరోజున భాగ్యనగరంలో జరిగిన ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగినప్పటికీ ఈమూవీకి బయటకు చెప్పుకోలేని అనేక సమస్యలు వెంటాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమూవీని పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాలు చాలవరకు హిందీలో డబ్ చేసినప్పటికీ అతడు నటిస్తున్న సినిమా మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా విడుదలకావడం ఇదే మొదటిసారి.


దీనితో ఈమూవీ ప్రమోషన్ ను దేశవ్యాప్తంగా జరపవలసి ఉంది వాస్తవానికి జనవరిలో విడుదలకావలసిన ‘ఆర్ ఆర్ ఆర్’ జాతీయస్థాయి ప్రమోషన్ ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. అయితే ఈవిషయంలో ‘పుష్ప’ చాల వెనకపడి ఉంది. నిన్నటి నుండి మాత్రమే మన తెలుగు రాష్ట్రాలలో ఈమూవీ ప్రమోషన్ ప్రారంభం అయింది. ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులలో ఈమూవీ ప్రమోషన్ ను జాతీయ స్థాయిలో చేయడం జరగని పని అని అంటున్నారు.


ఇలాంటి పరిస్థితులలో అనవసరంగా ఈమూవీని పాన్ ఇండియా మూవీగా ప్రకటించి బన్నీ తప్పు చేసాడా అన్నఅభిప్రాయాలు కూడ వస్తున్నాయి. వాస్తవానికి ‘పుష్ప’ విడుదల కాబోతున్న 17వ తారీఖున చిరంజీవి ‘ఆచార్య’ ను విడుదల చేయాలనుకుని ఆడేట్ తనకు సద్దుబాటు చేయమని చిరంజీవి కోరినట్లు కూడ వార్తలు ఉన్నాయి. అయితే ఆడేట్ నుండి ‘పుష్ప’ ను వెనక్కు తీసుకు వెళ్ళడం ఇష్టం లేక ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ముందే ‘పుష్ప’ ను విడుదలచేయాలి అన్న గట్టి పట్టుదలతో ఇదే డేట్ కు బన్నీ పట్టుపట్టడంతో ‘ఆచార్య’ ఫిబ్రవరికి వెళ్ళవలసిన పరిస్థితి అంటారు.


ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లు పెంపు వ్యవహారం పై ఎటువంటి స్పందన లేదు. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ‘పుష్ప’ 150 కోట్ల బిజినెస్ చేసింది అంటున్నారు. ఇంత భారీ మొత్తంలో ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న టిక్కెట్ల రేట్ల పద్దతితో ‘పుష్ప’ సూపర్ హిట్ అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం అన్నమాటలు వినిపిస్తున్నాయి. దీనితో రకరకాల సమస్యల మధ్య విడుదల అవుతున్న ‘పుష్ప’ ఎంతవరకు బన్నీ పాన్ ఇండియా కలలను నెరవేరుస్తుంది అన్నసందేహాలు కలుగుతున్నాయి..
మరింత సమాచారం తెలుసుకోండి: