ఈ మధ్య కాలంలో చాలా మంది బ్రేకప్ అంటూ విడిపోయారు..పెళ్ళి చేసుకుని 100 ఏళ్లు కలిసి ఉంటాం అంటూ అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి విడిపోయిన జంటలు ఉన్నారు. కానీ ఎక్కువుగా నెట్టింట ట్రోల్ అయ్యింది..సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచింది మాత్రం సమంత-నాగచైతన్య , షన్నూ-దీప్తి మ్యాటర్లు మాత్రమే. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంత హాట్ గా కనిపించింది కొన్ని అభ్యంతకర సన్నివేశాలల్లో నటించింది అందుకే నాగచైతన్య సమంత ల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాటి కారణంగానే విడాకులు తీసుకున్నారు అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి.

ఇక షణ్ముఖ్-దీప్తి మ్యాటర్ లోను అంతే. బిగ్ బాస్ సీజన్ 5 లో షన్నూ తోటి కంటెస్టెంట్ సిరి తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఇక ఈ సీన్స్ ని తన ఇంట్లో నుండి చూసిన షన్నూ గర్ల్ ఫ్రెండ్ దీప్తి.. షణ్ముఖ్ హౌస్ నుండి బయటకు రాగానే బ్రేకప్ అంటూ బాంబ్ పేల్చింది. ఇక ఈ బ్రేకప్ వార్తతో చాలా మంది ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. బాధపడ్డారు. షన్నూ దీప్తి మళ్లీ కలవాలి అంటూ కోరుకున్నారు.

ఈ క్రమంలోనే నటి శ్రీరెడ్డీ కూడా తనదైన స్టైల్ లో రెస్పాండ్ అవుతూ దీప్తి ని డైరెక్ట్ గానే కొన్ని ప్రశ్నలు వేసింది. ఇక ఆ ప్రశ్నలకు దీప్తి ఇన్ డైరెక్ట్ గా రిప్లై ఇచ్చింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన దీప్తి శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల‌ పై పరోక్షంగా స్పందిస్తూ.. "నేను బిగ్ బాస్ హౌజ్‌ లోకి వెళ్లిన‌ప్పుడు నా వయస్సు 20 ఏళ్లు మాత్రమే. అప్పుడు నేను ఇంకా చిన్న‌దాన్ని. ఏది మంచి ఏది చెడు అనే విషయం నాకు తెలియదు" అంటూ తనీష్ తో తన ప్రవర్తన పై క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ వ్యవహారంతో షన్నూ మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా ట్రోల్ అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: