అడ్వకేట్ చంద్రుగా విలక్షణ నటుడు సూర్య పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.అయితే ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల నామినేషన్ కోసం భారతదేశం నుంచి ఎంపికైందట.. అయితే నామినేషన్ల తుది జాబితాలో జై భీమ్ చోటు సంపాదించలేకపోయిందని తెలుస్తోంది.దాంతో భారతీయ సినిమా అభిమానులు నిరాశ చెందారట.. ఈ సినిమాకు నామినేషన్‌లో చోటు లభిస్తుందని చాలా మంది సినీ అభిమానులు మీడియా దేశవ్యాప్తంగా ఎదురు చూశారట.
అయితే ఆస్కార్స్ నామినేషన్ల ప్రక్రియకు ముందు అంతర్జాతీయ సినిమా వెబ్‌సైట్ రాటెన్ టామెటాస్ ఎడిటర్ జాక్వలైన్ సానుకూలంగా స్పందించారని ఆస్కార్ నామినేషన్ల రేసులో జై భీమ్ ముందు ఉందని ఉత్తమ చిత్రంగా జై భీమ్ నామినేషన్ సంపాదించే అవకాశం ఉందని మీరు నన్ను నమ్మండి.. ఈ సినిమాకు మంచి గౌరవం దక్కుతుందని అన్నారట.. అయితే చివరి జాబితాలో జైభీమ్ లేకపోవడంతో అందరూ నిరాశకు గురి అవుతున్నారట.. అవార్డుల నామినేషన్ ప్రకటన కార్యక్రమం మొదలైన తర్వాత మీడియా మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారని తెలుస్తుంది.
లాక్‌డౌన్ కారణంగా థియేటర్ల మూసివేతతో జై భీమ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ అయిన ఓటీటీ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని అందరికి తెలుసు.ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ కూడా లభించింది. విమర్శకులు, సినీ అభిమానులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి