సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఎదగడం కొనసాగడం అనేది నిజంగా దేవుడు ఇచ్చిన వరం అనే చెప్పాలి. అందులోనూ టాలీవుడ్ సినిమా పరిశ్రమ లాంటి కమర్షియల్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా ఉండడం నిజంగా దేవుడిచ్చిన వరమే. అలాంటి ఆ హోదాను అతి తక్కువ కాలంలోనే అందిపుచ్చుకొని లక్కీ హీరోయిన్ గా భారీ స్థాయి ఇమేజ్ అందుకుంది హీరోయిన్ పూజా హెగ్డే. బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఆమెకు వచ్చిన గుర్తింపు ఆధారంగానే తెలుగు లో ఆమెకు భారీ స్థాయి పెరిగింది అని చెప్పవచ్చు.

మొదట్లో తెలుగులో సినిమా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మను ఎవరు పట్టించుకోవడం లేదు అందుకే బాలీవుడ్ కి వెళ్ళింది అక్కడ మంచి సినిమాలను చేసి తెలుగు వారిని కూడా మెప్పించింది. దాంతో ఆమె తెలుగులో కూడా నటించడం మొదలు పెట్టింది. ఆ విధంగా ఇప్పటి వరకు మంచి సినిమాల్లో నటించి నెంబర్ వన్ కథానాయికగా ఎదిగింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె చేతిలో బడా ప్రాజెక్టులు ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మూడో కాంబినేషన్ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇక్కడే పూజ హెగ్డే తెలివిగా ఆలోచిస్తుంది. కేవలం పెద్ద హీరోలతో మాత్రమే కాకుండా చిన్న హీరోలతో కూడా ఈమె నటించే విధంగా ముందుకు వెళుతుండటం అభిమానులకు రీ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. అలా నాగచైతన్య సరసన ఈ ముద్దుగుమ్మ మానాడు రీమేక్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం అందరినీ ఎంతగానో అలరిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే సక్సెస్ లో ఉన్న ఆమె చిన్న హీరోలతో సక్సెస్ కొట్టడం పెద్ద విషయమేమీ కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: