గత కొన్నేళ్లలో సినిమాల విషయంలో, రియాలిటీ షోల విషయంలో బాలయ్య చాలా మారారనే విషయం తెలిసిందే. గతంలో పలువురు ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి కెరీర్ విషయంలో తప్పటడుగులు వేసిన బాలయ్య గతేడాది అన్ స్టాపబుల్ షోతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు


ఈ షో ఐఎండీబీలో టాప్ రేటింగ్ ను సొంతం చేసుకున్న షోలలో ఒకటి కావడంతో ఆహా ఓటీటీకి అంచనాలకు మించి సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగడానికి కారణం కావడం విశేషం.


మరోవైపు బాలయ్య గోపీచంద్ మలినేని మరియు అనిల్ రావిపూడి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లకు అవకాశాలను కూడా ఇస్తున్నారు. అయితే బాలయ్యలో వచ్చిన ఈ మార్పుకు కారణం ఆయన రెండో కూతురు అని సమాచారం.. బాలయ్య చిన్న కూతురు తేజస్విని అన్ స్టాపబుల్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తేజస్విని తన తండ్రిని ఆ షోలో కొత్తగా చూపించడం కోసం చాలా కష్టపడ్డారట. బాలయ్య సినిమాల స్క్రిప్ట్ విషయాలలో కూడా తేజస్విని కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం అయితే అందుతోంది.


 


బాలయ్య లైనప్ వెనుక కారణం తేజస్విని అని తెలిసి నెటిజన్లు, బాలయ్య ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారట.. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండటం విశేషం. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారట. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది.


 


మరో రెండు వారాలలో బాలయ్య పుట్టినరోజు ఉండటంతో బాలయ్య పుట్టినరోజున ఈ సినిమా నుంచి టీజర్ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ కథకు సంబంధించి ఇప్పటికే క్లారిటీ కూడా వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య కూతురి రోల్ లో శ్రీలీల నటించనున్నారని తెలుస్తుంది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: