గతకొంతకాలంగా వార్తలకు పరిమితం అయిన ప్రభాస్ మారుతిల మూవీ ఎట్టకేలకు ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతోంది. వాస్తవానికి ఈమూవీ క్యాన్సిల్ అయింది అంటూ సోషల్ మీడియాలో అనేక వార్తల హడావిడి జరిగింది. అయితే ఆగాసిప్పులకు చెక్ పెడుతూ ఈమూవీ ప్రారంభం కావడంతో టాప్ హీరోతో సినిమా తీయాలి అన్న మారుతి కల నెరవేరబోతోంది.


గత కొంతకాలంగా మారుతి సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా తీసిన ‘పక్కా కమర్షియల్’ కూడ ఫెయిల్ అవ్వడంతో ప్రభాస్ మారుతిని నమ్మి అవకాశం ఇవ్వక పోవచ్చు అన్న సంకేతాలు వచ్చాయి. అయితే అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ ప్రభాస్ మారుతిని నమ్మడం ఇప్పుడు అతడి అభిమానులలో హాట్ టాపిక్ గా మారింది.


వాస్తవానికి ప్రభాస్ కెరియర్ గ్రాఫ్ కూడ అంతంతమాత్రంగానే ఉంది. లేటెస్ట్ గా విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్ పై విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో ఆమూవీ ఫలితం గురించి అభిమానులు ఖంగారు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ మారుతిని నమ్మడం ఒకవిధంగా సాహసమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమూవీలో ప్రభాస్ తాత మనవడు పాత్రలలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీతో పాటు సెంటిమెంట్ ప్రధానంగా ఉండే ఈమూవీ కథలో ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు అని తెలుస్తోంది.


మాళవికా మోహన్ నిధి అగర్వాల్ లు ఇప్పటికే ఈమూవీకి సంబంధించి హీరోయిన్స్ గా ఎంపిక అయితే మరొక హీరోయిన్ గురించి అన్వేషణ కొనసాగుతున్నట్లు టాక్. మారుతికి గతంలో బాగా కలిసి వచ్చిన దెయ్యం పాత్ర కూడ ఈమూవీలో ఉంటూ మారుతి మార్క్ కామెడీ ఉంటుంది అని అంటున్నారు. ప్రభాస్ కామెడీ రోల్ చేసి చాల సంవత్సరాలు అయిన పరిస్థితులలో ఒక మార్పు కావాలని ఈ పాత్రను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈమూవీ కూడ వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతోంది. మరి మారుతి ప్రయోగం ప్రభాస్ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: