పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది వరకే పవన్ ... హరీష్ కాంబి నేషన్ లో గబ్బర్ సింగ్ అనే మూవీ రూపొంది బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న రెండవ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 ఇలా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ని చాలా గ్రాండ్ గా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తలపతి విజయ్ హీరో గా రూపొందిన తమిళ సినిమా తేరి అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందబోతుంది. ఈ మూవీ రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా కథ లో చాలా మార్పులు ... చేర్పులు చేసి తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మరో హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా రెండవ హీరోయిన్ గా ఈ మూవీ లో మాళవిక మోహన్ ని తీసుకునే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు అలాగే ఇప్పటికే ఈ ముద్దు గుమ్మకు కథను వినిపించగా ఈ సినిమాలో నటించడానికి మాళవిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ ఆఫర్ కనుక మాలవిక కు వచ్చినట్లు అయితే  గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: