టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం తాజాగా రమేష్ కాడూరి దర్శకత్వంలో రూపొందిన మీటర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సాయి కార్తీక్ ఈ పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ మరియు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల తేదీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. మార్చి 29 వ తేదీన ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ ని ప్రకటిస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ లో కిరణ్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఇన్షెట్ వేసుకొని స్పెడ్స్ పెట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతం కిరణ్ కు సంబంధించిన ఈ వేరి స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయి రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్న ఈ యువ హీరో మీటర్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: