నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చ్ 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.

దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా లభిస్తున్నాయి. ఏదైనా సినిమా బాగుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమా గురించి అదిరిపోయే రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటాడు. అదే మాదిరిగా తాజాగా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న దసరా మూవీ గురించి కూడా సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించాడు.

తాజాగా మహేష్ బాబు "దసరా" మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... దసరా మూవీ చూసాను చాలా స్టన్నింగ్ గా ఉంది. నిజంగా అందరూ గర్వపడాల్సిన సినిమా అంటూ మహేష్ పోస్ట్ చేశాడు. తాజాగా మహేష్ దసరా మూవీ గురించి స్పందిస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దసరా మూవీకే ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: