
హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే పైన ఉన్న నార్కట్ పల్లి వద్ద పుష్ప సినిమాకి సంబంధించి ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు మరొక ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో పుష్ప-2 సినిమా యూనిట్లలో ఇద్దరికీ గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం నుంచి పుష్ప బస్సు డ్రైవర్ ది తప్ప లేకపోతే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని సమీపంలో ఉండే హాస్పటల్కి తరలించారు. హైదరాబాద్ విజయవాడ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.
పుష్ప-2 సినిమా విషయానికి వస్తే మొదటి భాగాన్ని మించి రెండో భాగం ఉండబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తూ ఉండగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫహద్ ఫాజీల్ నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఒక అతిధి పాత్ర ఉంటుందని ఈ పాత్రలో హిందీ స్టార్ హీరో రణవీర్ సింగ్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్లు సమాచారం ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి స్పష్టత అయితే రాలేదు.