హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. మొదట ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళ చిత్రం పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో తనదైన స్టైల్ లో నటించి గుర్తింపు సంపాదించుకున్న సాయిపల్లవి సహజ నటనతో అద్భుతమైన డాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన పాత్రలను కూడా చాలా సెలెక్టివ్ గా చేసుకుంటూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. చివరిగా ఇమే విరాటపర్వం, గార్గి వంటి చిత్రాలలో నటించింది.


ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమాలో కూడా మళ్లీ కనిపించలేదు..అయితే సాయి పల్లవి పెళ్లి కోసమే బ్రేక్ తీసుకుంది అంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో పెళ్లి దండలతో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇమే పక్కనే మరొక వ్యక్తి ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. ఈ ఫోటోలు చూసిన తర్వాత సాయి పల్లవి నిజంగానే వివాహం చేసుకుందాం అని ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు అయితే ఇప్పుడు తాజాగా అసలు విషయం ఏంటి అనేది తెలియక సతమతమవుతున్న సమయంలోనే విరాటపర్వం డైరెక్టర్ వేణువుడుగుల ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ తో స్పష్టత ఇవ్వడం జరిగింది.


డైరెక్టర్ సాయి పల్లవి పెళ్ళికి సంబంధించి పలు వాక్యాలు చేయనప్పటికీ అతడు పోస్ట్ చేసిన ఫోటోలు అన్ని ప్రశ్నలకు సమాధానాన్ని తెలియజేసింది.. ఈ ఫోటో నటుడు శివ కార్తికేయ తమిళ సినిమా పూజా కార్యక్రమంలో ది అంటూ ఫేస్ బుక్ వేణుఊడుగుల పోస్ట్ చేయడం జరిగింది.. దర్శకుడు పోస్ట్ చేసిన ఫోటో సాయి పల్లవి కి పెళ్లి అయిపోయిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలకు ఒకటే కావడం గమనార్హం..అయితే ఇక్కడ ఆఫ్ ఫోటో మాత్రమే ఉంచగా డైరెక్టర్ వేణు పూర్తి ఫోటోని పోస్ట్ చేసి అసలు విషయాన్ని తెలియజేశారు. దీంతో సాయి పల్లవి పెళ్లి అపద్ధమని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: