సౌత్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె కెరియర్ ఎలా సాగింది అన్న విషయం కూడా ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. అయితే రష్మిక మందన స్టార్ హీరోయిన్ అవ్వకముందే అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే హీరోయిన్గా ఒక్కో అడుగు వేస్తున్న సమయంలో రక్షిత్ శెట్టితో ప్రేమలో మునిగి తేలింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ కోలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది అని చెప్పాలి.


 అయితే ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి రష్మిక ఎంట్రీ ఇవ్వడంతో ఇక్కడ అదృష్టం కలిసి వచ్చి.. ఆమె స్టార్ హీరోయిన్గా ఎదగడం జరిగింది. ఆ తర్వాత కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రియుడుతో పెళ్లిని కాన్సల్ చేసుకుంది. అంతేకాదు రక్షిత్ శెట్టికి బ్రేకప్ కూడా చెప్పేసింది. అయితే రష్మికను  రక్షిత్ శెట్టి ఇంకా మర్చిపోలేక పోతున్నాడు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల అతను చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అని చెప్పాలి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు రక్షిత్ శెట్టి. ఒక వ్యక్తిని అదే పనిగా ద్వేషించడం సరికాదని దానివల్ల మనసులో మరింత భారం పెరుగుతుంది అని చెప్పుకొచ్చాడు.


 మనకు నచ్చలేదని ఎదుటి వ్యక్తిని ద్వేషించడం సరికాదు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని మనం గౌరవించాలి. అభిప్రాయాలు కలవనంత మాత్రాన ద్వేషించాల్సిన అవసరం లేదు. మనసులు కలవనప్పుడు వదిలేయాలి. జీవితంలో ముందుకు సాగిపోవాలి తప్ప.. ఆ బాధను మోస్తూ అలాగే ఉండకూడదు. అది మనకు మరింత భారంగా మారిపోతుంది అంటూ రక్షిత్ శెట్టి చెప్పుకొచ్చాడు. రష్మిక తో బ్రేకప్ బాధ నుంచి బయటపడటం అంత సులువు కాదని తెలిపాడు. ఇక మనసుకు తగిలిన గాయాన్ని ఆ భారాన్ని మర్చిపోవడం కూడా కష్టమే అంటూ రక్షిత్ శెట్టి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. సరైన పద్ధతిలో అర్థం చేసుకుంటే ఈ భారాన్ని తగ్గించుకోవచ్చు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: