తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లియో’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చైన్నైలో చాలా గ్రాండ్‌గా ఆడియో లాంచ్ ఈవెంట్ చేయాలనుకున్నారు మేకర్స్ కానీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారు.లియోకి ప్రస్తుతం తమిళ నాట వాతావరణం వేడిగా మారిపోయింది. అయితే ఈవెంట్ రద్దైనప్పటికీ.. ప్రమోషన్స్‌ను మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి దాకా రిలీజ్ అయిన లియో గ్లింప్స్, సాంగ్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు దళపతి విజయ్ ఫ్యాన్స్.ఎట్టకేలకు ఇప్పుడా సమయం రానే వచ్చేసింది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. లియో ట్రైలర్‌ను అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది.వచ్చే వారం లియో ట్రైలర్ విడుదలకు అఫిషీయల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.


ఇక నిన్న లియో సెకండ్ సింగిల్‌ బయటికి వచ్చేసింది. మాస్టర్ మూవీ తర్వాత విజయ్, లోకేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో లియోపై ఒక రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా… అర్జున్, సంజయ్ దత్ ఇంకా ప్రియా ఆనంద్ కీలకపాత్రలు పోషించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న లియో సినిమా రిలీజ్ కాబోతోంది.ఇంకా అదే రోజు తెలుగులో బాలయ్య నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ కూడా రిలీజ్ కానుంది. కోలీవుడ్‌లో విజయ్‌కు తిరుగులేకపోయినా… తెలుగులో మాత్రం మన బాలయ్యదే హవా. మరి లియో ఎలా పెర్ఫార్మన్స్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకి అనిరుధ్ రవి చందర్ సంగీతాన్ని అందించాడు.ఈ సినిమా ఖచ్చితంగా విక్రమ్, జైలర్ రికార్డులని బద్దలు కొడుతుందని విజయ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి వసూళ్ళని నమోదు చేస్తుందో. ఇంకా ఎన్ని రికార్డులని బద్దలు కొడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

LEO