హీరోయిన్ ప్రియమణి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి  తన నటన తో తన అందం అభినయం తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఒకానొక సమయం లో దాదాపు దశాబ్ద కాలం పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది అని చెప్పాలి. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకొని కొన్నాళ్లపాటు ఇక కెరియర్ కు పులిస్టాప్ పెట్టింది. కానీ ఆ తర్వాత ఆ ఫులి స్టాప్ ను చెరిపేసి మళ్ళీ కెరీర్ ను మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.


 ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో జడ్జిగా ప్రత్యక్షమైంది. దీంతో ప్రేక్షకులందరికీ మరోసారి దగ్గర అయింది. ఇక వరుసగా అవకాశాలు కూడా ఈ అమ్మడి తలుపు తట్టాయి అని చెప్పాలి. దీంతో ఒక వైపు సీనియర్ హీరోల సినిమాలో ఛాన్సులు దక్కించుకుంటూ  ఇంకోవైపు యంగ్ హీరోల సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుంది. మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా చేస్తూ బిజీ బిజీగా మారింది.  ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకుపోతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఒక హీరో పై మాటల్లో చెప్పలేనంత క్రష్ ఉంది అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది.


 ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక ఇంటర్వ్యూకి హాజరైంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుల్లో ఎవరిపైన అయినా క్రష్ ఉందా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది. షారుక్ ఖాన్ పైన క్రష్ ఉంది అంటూ చెప్పుకొచ్చింది. తనకు చాలామంది నటులు ఇష్టం అంటూ తెలిపింది  లక్కీగా షారుక్ ఖాన్ తో వర్క్ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇక మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: