పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా సలార్. ఈ సినిమా డిసెంబర్ 22 వ తేదీన థియేటర్స్ లోకి రాబోతోంది.భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ సలార్ సినిమాని రెండు భాగాలుగా నిర్మించింది. ఇక ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ తో స్పష్టం అవుతోంది.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో సలార్ కథ ఏంటి అనేది డైరెక్టర్ ప్రశాంత్ ఆల్ రెడీ నీల్ చెప్పేశారు. పార్ట్ 1 కంప్లీట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ని నాయకుడిగా నిలబెట్టడానికి దేవా పాత్రలో ప్రభాస్ చేసే సాహసాలతోనే ఉండబోతోందని సమాచారం తెలుస్తోంది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కూడా కొంత అసంతృప్తి మాత్రం వ్యక్తం అయ్యింది. ఆశించిన స్థాయిలో ఈ మూవీ ట్రైలర్ లేదని కామెంట్స్ వినిపించాయి.అయితే ఈ ట్రైలర్ లో మాత్రం నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్ ని చూపించారు.


అలాగే సలార్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ని కూడా ప్రేక్షకులకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ ట్రైలర్ ని పూర్తిగా ప్రభాస్ క్యారెక్టర్ ఎలివేషన్, యాక్షన్ ప్యాక్డ్ గా డిజైన్ చేసి వదలాలని అనుకుంటున్నారంట. ప్రస్తుతం ఇది ప్రచారంలో ఉండటంతో ప్రభాస్ అభిమానులు కూడా ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ గురించి త్వరలో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇందులో నిజం ఎంత అనేది క్లారిటీ రావాల్సి ఉంది. సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఇప్పటికే అన్ని భాషలలో కంప్లీట్ అయ్యింది. బిగ్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వస్తోన్న ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. మరి సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.సలార్ 1 రిలీజ్ తర్వాత వచ్చే ఏడాది సలార్ 2 పెండింగ్ షూట్ కూడా కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం.ఇక ప్రస్తుతం ప్రభాస్ మోకాలి ఆపరేషన్ చేసుకోవడంతో ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు.అందువల్ల ప్రమోషన్స్ కి రాలేడు.ఆయన సలార్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి బయటకొచ్చే అవకాశం ఉంది.ఈ సినిమాలో 45 నిమిషాల తరువాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: