ఇక ఈ వీకెండ్ నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ రెండు సినిమాలు వస్తున్నాయి. గురువారం నాని సినిమా వస్తుండగా నెక్స్ట్ డే అంటే శుక్రవారం నాడు నితిన్ మూవీ వస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా రెండు డిఫరెంట్ జోనర్స్ గా వస్తున్నాయి.ఇక నాని హాయ్ నాన్న ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో పాటుగా మృణాల్ తో లవ్ అండ్ ఎమోషనల్ కథతో వస్తుంది. ఈ సినిమాకు హేషం అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.దసరా సినిమా తర్వాత నాని మరోసారి తన మార్క్ సినిమాతో వస్తున్నాడు. దసరా సినిమాలో ధరణి పాత్రతో తను మాస్ పాత్రల్లో కూడా మెప్పించగలనని ప్రూవ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు  హాయ్ నాన్నతో తన న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించనున్నాడు.ఈ సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుందట. నాని, బేబీ కియారా, మృనాల్ మధ్య సీన్స్ ఎమోషనల్ గా ఉంటాయట.ఇక మరోపక్క నితిన్ తనకు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఎంటర్టైనింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాతో వస్తున్న నితిన్ సినిమా మొత్తం ఆడియన్స్ ని కచ్చితంగా నవ్విస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. నితిన్ మార్క్ ఎంటర్టైనింగ్ సినిమాగా ఈ సినిమా వస్తుంది. పైగా ఈ సినిమాకు శ్రీ లీల గ్లామర్ కూడా ప్లస్ అయ్యేలా ఉంది. ఆల్రెడీ హారిస్ జయరాజ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.


ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రెండు మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. లాస్ట్ వీక్ వచ్చిన యానిమల్ సినిమా ఎఫెక్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఎలాగు నెక్స్ట్ వీక్ కూడా పెద్ద సినిమాలు లేవు. కాబట్టి నాని, నితిన్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయితే మాత్రం రెండు వారాల పాటు వారి సినిమాలు రన్ అయ్యే అవకాశం ఉంది. దసరా సినిమా తర్వాత నాని మరో హిట్ కొట్టాలని చూస్తుండగా మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ తర్వాత నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.అయితే వీరిద్దరిలో విజేత ఎవరన్నది రెండు రోజుల్లో తెలుస్తుంది. ఈ సినిమా టికెట్ రేట్ల విషయానికి వస్తే తెలంగాణాలో సింగిల్ స్క్రీన్స్ 175 ఉండగా మల్టీప్లెక్స్ వచ్చేసి 295 దాకా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే సింగిల్ స్క్రీన్ 145, మల్టీప్లెక్స్ 177 రూపాయలుగా రేట్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: