
ఈ నేపథ్యంలో ఇప్పుడు క్లోజ్ కాబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. షో కి రేటింగ్ అంతగా రావడం లేదని, కమెడియన్ల స్కిట్లు పేలడం లేదనే కామెంట్లు వస్తున్నాయి. గతంలో మాదిరిగా హాస్యం పండటం లేదంటున్నారు. జబర్దస్త్ నుంచి చాలా మంది ఆర్టిస్టులు వెళ్లిపోవడంతో ఆ కిక్ పోయిందంటున్నారు. అనసూయ మానేయడం, హైపర్ ఆది, సుధీర్‌లు వెళ్లిపోవడంతో కామెడీలో దమ్ము ఉండటం లేదంటున్నారు.కామెడీ మాత్రమే కాదు, దాన్ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్ పెళ్లి స్కిట్లు, సుధీర్, రష్మిల కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందనే చూసేవాళ్లు. ఇప్పుడు వాళ్లు లేకపోవడంతో ఆ మజా రావడం లేదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కారణంతోనే మల్లెమాల నిర్వహకులు ఈ షోని క్లోజ్ చేయాలనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. అయితే అసలు వాస్తవం ఏంటనేది తాజాగా బయటకు వచ్చింది. నిజానికి ఈ షోని క్లోజ్ చేస్తున్నారు. కానీ క్లోజ్ చేయడం లేదు. అందులోనే పెద్ద ట్విస్ట్ ఉంది. ఇప్పుడు జబర్దస్త్ షో రెండు ఎపిసోడ్లుగా ప్రసారం అవుతుంది.గురువారం జబర్దస్త్ షో, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఉంటుంది. గురువారం షోలో ఇప్పుడు సిరి యాంకర్‌గా ఉంది. అంతకు ముందు సౌమ్య రావు ఉండేది. అంతకు ముందు అనసూయ యాంకర్‌గా ఉండేది. ఇందులో కృష్ణభగవాన్, ఇంద్రజ జడ్జ్ లుగా ఉన్నారు. ఇక శుక్రవారం షోకి రష్మి గౌతమ్ యాంకర్, కృష్ణభగవాన్, ఖుష్బు జడ్జ్ లుగా ఉండేది. ఖుష్బు స్థానంలో మహేశ్వరి జడ్జ్ గా వచ్చింది.
అయితే ఈ రెండు షోస్ కాకుండా రెండు కలిపి ఒక్కటి చేయబోతున్నారట. రెండు అయితే స్కిట్లు అంతగా పేలడం లేదు. దీంతో రెండు కలిపి ఒకటి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రాథమిక ఐడియా మాత్రమే. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి తెరవెనుక చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ నిర్ణయానికి కారణం మరోటి ఉందట. కొత్తగా మరో షోని ప్లాన్ చేస్తున్నారట. ఆ వచ్చే షోని గురు గానీ, శుక్రగానీ అడ్జెస్ట్ చేసి, మిగిలిన రోజుని జబర్దస్త్ షోని నిర్వహించాలనుకుంటున్నారట. మరి ఆ కొత్త షో వర్కౌట్ అయితేనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని, లేదంటే యదావిధిగా దీన్ని రెండు షోలను కొనసాగిస్తారని సమాచారం. మొత్తానికి షో మాత్రం కచ్చితంగా ఉండబోతుంది. ఇది జబర్దస్త్ అభిమానులు రిలాక్స్ అయ్యే విషయమనే చెప్పొచ్చు.