సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ కాలం చాలా తక్కువ అని చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రమే కాదు కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇది కొనసాగుతూనే వస్తుంది. ఒకప్పుడు హీరోల సరసన హీరోయిన్గా నటించి గుర్తింపును సంపాదించుకున్న వారు.. ఇక తర్వాత కాలంలో మాత్రం అదే హీరోలకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఏకంగా హీరోయిన్గా ఉన్నప్పుడు రొమాన్స్ చేసిన.. అదే హీరోకి అక్క వదిన పాత్రల్లో కూడా నటించడం చూస్తూ ఉంటాం. హీరోయిన్ కి పెళ్లయి పిల్లలు పుట్టారు అంటే చాలు ఏకంగా ఆంటీ పాత్రలు చేసేందుకు కూడా అటు హీరోయిన్లు సిద్ధమవుతూ ఉంటారు అని చెప్పాలి


 అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో హవా నడిపించిన భూమిక సైతం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా కొనసాగిన భూమిక ఇప్పుడు హీరోలకు అక్క వదిన పాత్రలు చేస్తూ సరిపెట్టుకుంటుంది. ఇక ఆమెకు అలాంటి పాత్రలే వస్తూ ఉండటంతో కాదనలేక చివరికి ఇలాంటి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు హీరోయిన్ భూమికకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒకప్పుడు హీరో సరసన హీరోయిన్గా నటించి ఇక హీరోతో రొమాన్స్ చేసిన భూమిక.. ఇక ఇప్పుడు అదే హీరోకి అక్క పాత్రలో కనిపించబోతుంది అంటూ ఒకటాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.


 ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవర అనే మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్కు అక్క పాత్రలో కనిపించబోతుందట భూమిక. అయితే ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రకు ఇలా అక్కగా నటించబోతుందట. దీంతో ఈ విషయం తెలిసి సినీ జనాలు భూమికపై జాలి పడుతున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ పక్కన సినిమాల్లో హీరోయిన్గా నటించి ఇక ఇప్పుడు అదే హీరో సినిమాలు అక్క పాత్రలో కనిపించబోతుంది. ఈ కష్టం ఏ హీరోయిన్ కి రావద్దు అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. కాగా భూమిక ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్నో సినిమాల్లో అక్క వదిన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: