సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్లకు సంబంధించిన ఏదైనా విషయం తెరమీదకి వచ్చింది అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఎవరైనా హీరో ఒక సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేశాడు అంటే చాలు ఇక ఆ ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక ఎంతోమంది స్టార్ హీరోల త్రో బ్యాక్ ఫోటోలు కూడా అప్పుడప్పుడు ఇంటర్నెట్ లోకి వస్తూ అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఏకంగా అభిమానులు సైతం తమ ఫేవరెట్ హీరో త్రో బ్యాక్ ఫోటో ని చూసి అందులో ఉన్నది ఆ హీరోనే అని గుర్తుపట్టలేకపోతు ఉంటారు.



 మరి కొన్నిసార్లు ఇక హీరో హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒక మహిళ ఒక ఐదేళ్లు ఉండే చిన్న అబ్బాయిని ఎత్తుకున్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేర్ చేస్తుంది. అయితే ఈ ఫోటోలో ఉన్నది ఎవరో అనుకునేరు.. టాలీవుడ్ ప్రేక్షకులు అందరికీ తెలిసిన క్రేజీ హీరో.. ఇక కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడు. ఎప్పుడు విభిన్నమైన కథలను చేసేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడు.



 జయంతో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు దిగ్విజయంగా తన కెరీర్ను కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఈ హీరో తండ్రి కూడా నిర్మాతగా రాణిస్తూ ఉన్నాడు. జయం అనగానే మీకు ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవరు అర్థం అయ్యే ఉంటుంది. ఆ హీరో ఎవరో కాదు నితిన్. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న సుధాకర్ రెడ్డి వారసుడు హీరో నితిన్. హైదరాబాద్లో విద్యాభ్యాసం ముగించుకొని 19 వయసులోనే జయం సినిమాతో నటుడుగా అరంగేట్రం చేసి.. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా కొనసాగుతూ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: