పుష్ప ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించకపోయినా కూడా ఇంటర్నెట్ లో వరల్డ్ వైడ్ గా బాగానే ట్రెండ్ అయింది. అది దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్  వెంటనే కొత్త ప్రాజెక్ట్ పట్టలెక్కిస్తారోనని తెలియాల్సి ఉంది. పుష్ప-2 సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తో బన్నీ వర్క్ చేయనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అట్లీ మూవీ తర్వాతే అల్లు అర్జున్.. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా తదితరులతో మూవీ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. అట్లీ ఇటీవల జవాన్ మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 7వ తేదీన అట్లీతో చేయబోయే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రానుందని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అదే రోజు పుష్ప టీజర్ కూడా విడుదల అవ్వనున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. అందుకోసం పుష్ప మూవీ టీమ్.. చాలా కష్టపడుతుందట.


కచ్చితంగా ఆడియన్స్ ను అలరించాలని మూవీ యూనిట్ ఫిక్స్ అయిందట. అన్ని అనుకున్నట్లు జరిగితే.. పుష్ప-2 మూవీ టీజర్ ఇండస్ట్రీని షాక్ చేయనుందని చెప్పవచ్చు.అంతకుముందు బన్నీ బర్త్ డే కానుకగా.. అల్లు అర్జున్ నటించిన మూవీ ఆర్య-2 కూడా రీ రిలీజ్ కానుంది. 15 ఏళ్ల క్రితం రిలీజైన ఈ మూవీ... ఇప్పుడు థియేటర్లలో మళ్లీ సందడి చేయనుంది. ఏప్రిల్ 6 లేదా ఏప్రిల్ 7వ తేదీన ఆర్య-2 మూవీ తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ప్రదర్శితమవ్వనుంది. ఇక మరికొద్ది రోజుల్లో అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన ఘనత కూడా చేరనుంది.దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు స్టాచు కొలువుదీరనుంది. అందుకు సంబంధించిన కొలతలను కూడా మ్యూజియం నిర్వాహకులు ఇటీవల తీసుకున్నారు. అక్కడ ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మహేశ్ ఇంకా ప్రభాస్ విగ్రహాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా బన్నీ కూడా ఆ లిస్ట్ లోకి చేరనున్నారు. మార్చి 28వ తేదీ జరగనున్న ఈ ఆవిష్కరణ వేడుకలకు అల్లు అర్జున్ కూడా హాజరవనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: