స్టార్ హీరోల సినిమాలు వచ్చాయి అంటే చాలు అభిమానులందరికీ కూడా పండగే. ఏకంగా థియేటర్ మొత్తం అభిమానుల హడావిడితో  దద్దరిల్లి పోతూ ఉంటుంది. ఇక హీరో నటన చూసి విజిల్స్ చప్పట్లతో అభిమానులు రెచ్చిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంత మంది ఆడియన్స్ మాత్రం కమర్షియల్ సినిమాల్లో కూడా లాజిక్కులు వెతుకుతూ ఇక ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మార్చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ హీరోలకు సంబంధించి ఇలాంటి విషయాలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.


 లాజిక్కులు లేని సన్నివేశాలను స్టార్ హీరోలు సినిమాల్లో పెడితే అభిమానులను మోసం చేస్తున్నారంటూ కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి విమర్శలపై నిర్మాత నాగవంశీ ఇటీవల స్పందించాడు. కేవలం ఈ ఒక్క విషయంపై కాదు గతంలో ఇక తన సినిమాల విషయంలో వచ్చిన ఎన్నో విమర్శలను కాస్త గట్టిగానే తిప్పి కొట్టాడు నిర్మాత నాగ వంశీ. అయితే ఇప్పుడు గుంటూరు కారం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెద్ద హీరోల సినిమాలకు లాజిక్కులతో పనిలేదు అంటూ నిర్మాత నాగ వంశీ చెప్పుకొచ్చాడు.


 ఎందుకంటే కమర్షియల్ హీరోల సినిమాల్లో ఎలివేషన్స్ చూసి ఎంజాయ్ చేయాలి అంటూ తెలిపాడు. సలార్ మూవీలో ప్రభాస్ ను చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తే.. కొందరు మాత్రం సన్నివేశాలలో లాజిక్ లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. గుంటూరు కారం మూవీ లో కూడా హీరో తరచూ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లి రావడం గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తూ ఉన్నాయి. కానీ అదే సినిమాలో ఓటీటీలో విడుదలైన తర్వాత బాగుంది అని అందరూ మెచ్చుకుంటున్నారు. స్టార్ హీరోలు సినిమాల్లో లాజికులు కాకుండా ఎలివేషన్స్ చూసి ఎంజాయ్ చేయాలి అంటూ నిర్మాత నాగ వంశీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: