- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


పుష్ప సినిమాతో తన క్రేజ్ను జాతీయ స్థాయిలో పెంచుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో దానిని ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకు వెళ్ళాడు. పుష్ప 1 - 2 సినిమాల తో బన్నీ మార్కెట్తో పాటు జాతీయస్థాయిలో ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. సౌత్ .. నార్త్ అని తేడా లేకుండా వరల్డ్ వైడ్గా పుష్ప రాజ్‌ తన సత్తా చాటాడు. పుష్ప 2 సినిమా 1800 కోట్ల వసూలు చేసి ఎన్నో రికార్డులు సృష్టించింది . పుష్ప 2 సినిమా తర్వాత బన్నీ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా ? అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. ఇక బన్నీ తర్వాత సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు తమిళ యంగ్‌ స్టార్ డైరెక్టర్ అట్లీ లలో ఎవరితో ఒకరితో ఉంటుందని అంటున్నారు. బన్నీ - త్రివిక్రమ్ కాంబినేష న్లో సినిమా వస్తుందని నిర్మాతలు ఎప్పుడో ప్రకటించారు. సడన్గా అట్లీ లైన్లోకి వచ్చాడు. ఇక అల్లు అర్జున్ తన తర్వాత సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నాడని సమాచారం.


ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రీసెంట్ గానే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలిసి ఈ సినిమా ఫుల్ నెరేషన్ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. మైథాలజికల్ పిరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ నెవర్ బిఫోర్ లుక్ లో దర్శనం ఇస్తాడని అంటున్నారు. హారిక హాసినిక్ క్రియేషన్స్ రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. జులాయి - సన్నాఫ్ సత్యమూర్తి - అల వైకుంఠపురంలో లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తర్వాత బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: