ఇక మన భారతీయ చిత్ర పరిశ్రమలో లేడీ డైరెక్టర్ గా సుధా కొంగర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .. సూర‌రై పొట్రు సినిమా తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న సుధా కొంగర .. ముందుగా రైటర్గా , అసోసియే డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు వర్క్ చేసింది .. అలాగే మణిరత్నం దగ్గర పలు సినిమాలకు సుధా పనిచేసింది .. రైటర్ గా మంచి అనుభవం వచ్చాకే సుధా డైరెక్టర్గా ప్రయత్నం మొదలుపెట్టింది .


మొదట ద్రోహి అనే సినిమా తో డైరెక్టర్ గా పరిచయమైన సుధాకు .  ఆ తర్వాత మాధవన్‌తో చేసిన ఇరుదై సుత్రుకు మంచి ఫేమ్ వచ్చింది .. ఇదే సినిమాను తెలుగులో వెంక‌టేష్‌తో గురువుగా రిలీజ్ చేసి మంచి విజయం కూడా అందుకుంది .. ఆ తర్వాత సూర్యతో చేసిన ఆకాశమే హద్దురా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. సినిమాకి కూడా ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి . ఇక ప్రస్తుతం శివ కార్తికేయ‌న్ తో పరాశక్తి సినిమాను చేస్తున్న సుధా కొంగర రీసెంట్గా టీజర్ ని కూడా రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ..


నిజానికి ఈ సినిమాను సుధా సూర్య తో చేయాలనుకుంది . ఆకాశమే హద్దుర‌ తర్వాత సూర్య , సుధా కలిసి మరో సినిమా చేయాలని కథను కూడా రెడీ చేసుకున్నారు .. ఊహించని విధంగా సూర్యా తో ఈ సినిమా క్యాన్సిల్ అయి శివ కార్తికేయన్ దగ్గరకు వెళ్ళింది .. కోలీవుడ్లో సెటైల్ అయినప్పటికీ సుధా కొంగర తెలుగు అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు .. సుధా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పుట్టింది .. సుధా  తండ్రి ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిగా ఆమె తల్లి తమిళనాడుకు చెందినవారు .. ఆంధ్రలో పుట్టినప్పటికీ తమిళనాడులోని పెరిగింది ప్రస్తుతం సుధా  శివ కార్తికేయ‌న్ తో చేస్తున్న పరాశక్తి సినిమా పై అయితే భారీ అంచనాలు ఉన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: