నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపు అందుకుంది. ఆ సినిమా అనంతరం ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసి అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం ఈ చిన్న దానికి విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి. రష్మిక తన నటనకు గాను ఎన్నో ఆవార్డులను సైతం సొంతం చేసుకుంది. 

ఇక రష్మిక రీసెంట్ గా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తీశారు. ఈ సినిమా అత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా చివర్లో పుష్ప-3 సినిమా కూడా ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ ను వచ్చే సంవత్సరంలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కాగా పుష్ప-3 సినిమాలో రష్మిక పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. పుష్ప-3లో అల్లు అర్జున్ చుట్టే సినిమా కథ తిరుగుతూ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. పుష్ప-1, పుష్ప-2లో ఈ అమ్మడు పాత్ర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ పుష్ప-3లో మాత్రం తన పాత్ర కనీసం 15 నిమిషాలు కూడా ఉండదని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ సినిమాకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది. ఈ సినిమాకు సంబంధించి సుకుమార్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: