
యావన్ శంకర్ రాజా:
ఈ జాబితాలో టాప్ 5 మ్యూజిక్ డైరెక్టర్ గా యావన్ శంకర్ రాజా నిలిచాడు. ఆయన చివరిగా స్వీట్ హార్ట్ సినిమాకు సంగీతం అందించగా.. సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే యావన్ శంకర్ రాజా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన చివరి ప్రాజెక్ట్ ఏంటంటే విజయ్.. గోట్ అనే చెప్పాలి. సినిమాలో సంగీతం ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. యావన్ శంకర్ రాజా ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ. 5కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.
జీవి ప్రకాష్:
మొదట కోలీవుడ్ నటుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన జీవి ప్రకాష్ ఇటీవల నటనకు దూరంగా ఉంటూ మ్యూజిక్ పై ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు. అలా ఈ ఏడాది వడంగానే, కింగ్స్టన్, నిక్, గుడ్ బాడ్ అగ్లీ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు జీవి ప్రకాష్. ఆయన ఒక్క సినిమాకు రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్ను అందుకుంటున్నాడు.
థమన్ :
సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో అదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న సంగీత దర్శకుల థమన్ 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆయన ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నాడు.
ఏఆర్ రెహమాన్:
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో 30 ఏళ్లకు పైగా తన మ్యూజిక్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వ్యక్తి ఏఆర్ రెహమాన్. ఈయన తర్వాత వచ్చిన హారిస్ జయరాజ్, విద్యాసాగర్ లాంటి వాళ్లు వచ్చి మ్యూజిక్ డైరెక్టర్లు ఫేడ్ అవుట్ అయినప్పటికీ.. ఏఆర్ రెహమాన్ మాత్రం ఇప్పటికీ మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ఇక ఆయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు.
అనిరుధ్ రవిచంద్రన్:
కొలివుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్న సంగీత దర్శకులలో అనిరుధ్ రవిచంద్రన్ ఒకడు. ఈ ఏడాది కూలి, జననాయగన్, జైలర్ 2, కింగ్‌డమ్, మద్రాసి, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలుకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడు.