
ఇదిలా ఉండగా.. ఇటీవల ఒక ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతుంది. హీరో నానిని ప్రభాస్ తో కలిసి నటించడం గురించి అడిగితే నాని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకి ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించాలని ఉందని అన్నారు. ప్రభాస్ తో కలిసిన నటించేందుకు ఆయనకు సరిపోయే అంత గొప్ప ప్రాజెక్టు దొరకాలని తను ఆశిస్తున్నట్లు నాని చెప్పుకొచ్చారు. హిట్ 3 సినిమా హిట్ కొట్టడంతో.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చెక్కర్లు కొడుతుంది. ఇది చూసిన ప్రేక్షకులందరూ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
హీరో నాని ఇటు హీరోగా మూవీస్ లో నటిస్తూనే.. అటు నిర్మాతగా సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. హిట్ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీకి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. ఇప్పటికే హిట్ 1, హిట్ 2 రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి. ఇక ఇప్పుడు హిట్ 3తో హీరో నాని ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో హీరో నాని చాలా వైల్డ్ గా కనిపించారు. మూవీ మొత్తం రక్త పాతంతో నిండి ఉంది. హిట్ 3 సినిమా రిలీజ్ అయ్యి ఒక డిఫరెంట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.