
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా సాహో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా ఓజి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే స్టైలిష్ గ్యాంగ్ స్టార్ గా నటిస్తున్న ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కు కాస్త ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. పవన్ డేట్లు ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఫైనల్ గా పవన్ డేట్లు ఇవ్వడంతో ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభించారు. ఈ క్రమంలోని ఈ సినిమా షూటింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ చేంజ్ తో మొదలైనట్టుగా తెలుస్తోంది. గతంలో ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా రవి కే చంద్రన్ పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ డేట్లు ఆలస్యం కావడంతో రవి కె చంద్రన్ స్థానంలో మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఆ స్థానాన్ని భర్తీ చేసినట్టు తెలుస్తోంది. మరి మనోజ్ అందించే విజువల్స్ ఓజి సినిమాకు ఎలా ఉంటాయో ? పవన్ ఎంత స్టైలిష్ గా తెరమీద కనిపిస్తారో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు