
రామయ్యా వస్తావయ్యా మూవీ ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. నిర్మాత దిల్ రాజుకు సైతం ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. అప్పటికే చూసిన ఎన్నో సినిమాలను గుర్తు చేసే విధంగా రామయ్యా వస్తావయ్యా ఉండటంతో ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఈ సినిమా ఫెయిల్ అయిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
అయితే ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా హరీష్ శంకర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మళ్లీ పుడతాడా అంటూ చేసిన కామెంట్లు అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన హరీష్ శంకర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అలా కామెంట్లు చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్టీఆర్ హరీష్ శంకర్ కాంబోలో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు హరీష్ శంకర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తారక్ సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో కెరీర్ పరంగా మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.