పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ గా దర్శనమిచ్చింది ఓ టాలీవుడ్ హీరోయిన్. ప్రస్తుతం సదరు హీరోయిన్ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఐశ్వర్య లక్ష్మి. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని కొందరు చెబుతుంటారు. కానీ ఐశ్వర్య లక్ష్మి డాక్టర్ చదివాకే యాక్టర్ అయ్యింది. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. 2014లో సరదాగా మోడలింగ్ మొదలుపెట్టింది. పలు యాడ్స్ లో నటించింది. అవే ఆమెకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టాయి.


2017లో మ‌ల‌యాళ చిత్రంతో నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఐశ్వర్య లక్ష్మి.. అనతి కాలంలోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరైంది. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు భాషల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో నవీన్ చంద్రతో కలిసి ఐశ్వర్య లక్ష్మి నటించిన `అమ్ము` సినిమా చాలా మందిని ఆకట్టుతుంది. అంతకన్నా ముందు తెలుగులో `గాడ్సే` మూవీలో ఐశ్వర్య లక్ష్మి నటించింది. ప్రస్తుతం సాయి ధర‌మ్ తేజ్ కు జోడిగా `సంబరాల ఏటి గట్టు` అనే చిత్రం చేస్తోంది.
మరోవైపు కమల్ హాసన్, శింబు హీరోలుగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన `థగ్ లైఫ్` కూడా ఐశ్వర్య లక్ష్మి ముఖ్యపాత్రను పోషించింది. జూన్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య లక్ష్మి తాజాగా బేబీ బంపర్ తో ఉన్న ఫోటోలను పంచుకుంది. మొదట ఈ ఫోటోలు చూడగానే నెటిజ‌న్లు ఒకింత షాక్ అయ్యారు. పెళ్లి కాకుండానే ఐశ్వర్య ప్రెగ్నెంట్ అయ్యిందా అంటూ నోరెళ్ల‌బెట్టారు.


కానీ ఆ తర్వాతే అసలు విషయం అర్థమైంది. నిజానికి రీసెంట్ గా తమిళంలో ఐశ్వర్య లక్ష్మి నటించిన `మామన్` సినిమా విడుదలైంది. సూరి ఇందులో హీరో. ఈ సినిమాలోని ఫోటోలనే ఐశ్వర్య లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకుంది. ఏదేమైన ఐశ్వర్య లక్ష్మి బేబీ బంప్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: