
మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి డెడికేషన్ కి టైమింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాను ఏ టైం లో రిలీజ్ చేస్తాను అని ప్రామిస్ చేసారో అదే టైంలో రిలీజ్ చేశారు . ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు అనిల్ రావిపూడి . అంతేకా రీసెంట్గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్నారు చిత్ర బృందం. అయితే ఈ సినిమా అప్పుడే 30% షూటింగ్ కంప్లీట్ చేసేసుకున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది . అనిల్ రావిపూడి పక్క ప్లానింగ్ తో ఏ విషయాన్ని బయటికి రానికుండా 30% షూటింగ్ ని కంప్లీట్ చేసేసారట.
పట్టుమంటే రెండు నెలలు కూడా పూజ కార్యక్రమాలు చేసి కాలేదు . అప్పుడే 30% షూటింగా కంప్లీట్ చేసేసాడా..? నిజంగానే అనిల్ రావిపూడి గ్రేట్.. ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ తర్వాత అంత ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేసే డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రమే అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే మరో ఆరు నెలల్లో సినిమా షూటింగ్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది . ఒక రెండు నెలలు సినిమాకి ప్రమోషన్స్ అనుకున్న జనవరిలో అనుకున్న టయానికి అనుకున్న తేదీనే రిలీజ్ చేసేస్తాడు మూవీ ని అనిల్ రావిపుడి అని చెప్పడంలో సందేహమే లేదు . నో డౌట్ ఈసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ విన్నర్ గా చిరంజీవి కచ్చితంగా హిట్ కొడతాడు అంటున్నారు మెగా అభిమానులు . మరికొందరు బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడు అనిల్ రావిపూడి అంటూ తెగపొగిడేస్తున్నారు . నిజమే అనిల్ రావిపూడి చాలా చాలా ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేసేస్తున్నాడు..ఆయనకి సినిమా పై ఉండే ప్యాషన్ అలాంటిది మరి..!