టాలీవుడ్ కి అర్ధనారి వంటి హిట్ సినిమాతో  హీరోగా అడుగు పెట్టి మంచి క్రేజ్‌ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్  షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు .అలాగే  ఆ త‌ర్వాత‌ 'తెప్పసముద్రంస , 'వెడ్డింగ్ డైరీస్' వంటి ప‌లు వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటు ఓ ప్ర‌త్యేక గూర్తింపు తెచ్చుకున్న‌డు . అయితే ఇప్పుడు  అర్జున్ అంబ‌టి హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'పరమపద సోపానం'. అచ్ఛమైన తెలుగు టైటిల్ తో వ‌స్తున్న‌ ఈ సినిమా ఓ ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది . జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. 'ఎస్.ఎస్.మీడియా' సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
 

గుడిమెట్ల ఈశ్వర్ ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవరిస్తున్నారు. అలాగే ఈ సినిమా కు గతంలో పూరి జగన్నాధ్ వంటి దిగ్గజ దర్శకుడి ద‌గ్గ‌ర‌ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ శివ పరమపద సోపానం సినిమా కి కథ , మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం అందిస్తున్నారు. అన్ని  కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది . ఈ క్ర‌మంలోనే ప్రమోషన్లను వేగవంతం చేస్తూ ముందుగా 'చిన్ని చిన్ని తప్పులేవో' అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్ .


మాస్ మహారాజ్ రవితేజ 'ఈగల్' వంటి సినిమా తో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ సినిమా నికి సంగీతం అందించారు. 'చిన్ని చిన్ని తప్పులేవో' పాటకి ఆయన అందించిన ట్యూన్ ఎంతో ట్రెండీగా ఉంది. సింగర్స్ పృథ్వీ చంద్ర , అదితి బావరాజు ఆలపించిన విధానం.. రాంబాబు గోశాల అందించిన సాహిత్యం ప్రెక్ష‌కుల‌ను ఆకర్షించే విధంగా ఉందని చెప్పాలి. ఇక విడుదలైన కాసేపటికే ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తుంది . ఈ సినిమా కూడా ఈ పాటలని అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుందని చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతుంది .. ఇక మరి ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి ..



మరింత సమాచారం తెలుసుకోండి: