పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారుండారు. ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా వచ్చే నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ మూవీలో మొఘల్ చక్రవర్తుల కాలంలో కోహినూర్ వజ్రం కోసం పోరాటం చేసే యోధుడు హరిహర వీరమల్లు పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఈ మూవీలో గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

హరిహర వీరమల్లు సినిమాకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మరియు ఎ. ఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, సునీల్, రఘుబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ 17వ శతాబ్దంలో జరిగిన కథ ఆధారంగా రూపొందించారు.
 
ఇక పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుండంటే చాలు ప్రేక్షకులకు పండుగ అనే చెప్పాలి. మరి ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో.. ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీ అయిపోయారు. చాలా కాలంగా  పవన్ కళ్యాణ్ సినిమాలలో కనిపించలేదు. ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు థియేటర్ లు సరిపోవని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ మూవీ విడుదల దగ్గరలో ఉండడంతో వారణాసిలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వారణాసిలో జరగనున్న ఈ ఈవెంట్ కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: