ఏంటి పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఆ స్టార్ డైరెక్టర్ కి బంధువు అవుతుందా..వరుసకి మరదలు అవుతుందా..ఇంతకీ పవన్ కళ్యాణ్ మొదటి భార్య బంధువు అయిన ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ మొదటి భార్య నాకు బంధువు అవుతుంది అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ స్టార్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ. రీసెంట్గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మొదట పెళ్లి చేసుకున్న నందిని మాకు బంధువే అవుతుంది..పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందినిది పోలవరం.అలా మా అక్కను పోలవరానికి చెందిన అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేశాం. అలా పెళ్లి జరగాక మాకు పోలవరానికి చెందిన నందిని కూడా తెలుసు. 

ఇక నందిని వాళ్ళవి చాలా పెద్ద ఫ్యామిలీస్. ఆమెను చిన్నప్పుడు చూసాను. అయితే నందిని పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు అనే విషయం నాకు మొదట తెలియదు. ఇక నాగార్జునతో నేను ఓసారి షూటింగ్ కోసం పోలవరం వెళ్ళినప్పుడు వర్షం కారణంగా నందిని ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పటికి పవన్ కళ్యాణ్ తో నందిని పెళ్లి కాలేదు. ఆరోజు నందిని వాళ్ళ ఇంట్లో మేము కొద్దిసేపు ఉన్నాము. నందిని ని అందరూ చిన్ని చిన్ని అని ప్రేమగా పిలుచుకునే వాళ్ళు. ఇక నందిని పెళ్లయ్యాక మళ్ళీ నేను పోలవరం వెళ్ళినప్పుడు ఆమె పెళ్లి ఆల్బమ్ ని వాళ్ళ నాన్న నాకు చూపించారు. అలా నందిని పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుందనే విషయం నాకు తెలుసు తెలిసింది అంటూ గీత కృష్ణ చెప్పుకొచ్చారు..

 ఇక పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి అంత రహస్యంగా సింపుల్గా జరగడానికి కారణం పవన్ కళ్యాణే అని,ఆయనకు గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆయన ఇష్ట ప్రకారమే కుటుంబ సభ్యులు నందినీతో వివాహం షిరిడి తీసుకువెళ్లి చాలా సింపుల్ గా చేశారు అంటూ గీత కృష్ణ చెప్పుకొచ్చారు. ఇక నందినితో పవన్ కళ్యాణ్ వివాహం ఎన్నోరోజులు కొనసాగలేదు.నందిని కి విడాకులు ఇచ్చేసి రేణు దేశాయ్ ని ప్రేమించి ఇంట్లోనే సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. ఇక చివరికి రేణు దేశాయ్ కి కూడా విడాకులు ఇచ్చి రష్యాకి చెందిన అన్నా లెజ్నోవాని పెళ్లాడారు

మరింత సమాచారం తెలుసుకోండి: