- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

యూనివర్సల్ హీరో కమలహాసన్ .. క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం .. అలాగే మరో కుర్ర క్రేజీ హీరో సింబు కాంబినేషన్లో వచ్చిన సినిమా థ‌గ్‌ లైఫ్. నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా చూసిన మెగా అభిమానులు బాగా టెన్షన్ పడుతున్నారు. దీనికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ అని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ హీరో .. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తర్వాత సినిమా పెద్ది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి కూడా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కుతోంది.


ఇదే ఇప్పుడు మెగా అభిమానులను టెన్షన్ పడేలా చేస్తోంది. థ‌గ్ లైఫ్ సినిమా కు ఏఆర్ రెహ్మ‌న్ అందించిన సంగీతం ప్రేక్ష‌కుల‌కు నీరసం తెప్పించేలా ఉంది. సాంగ్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. కనీసం బ్యాగ్రౌండ్ స్కోరైనా బాగుంటుంది అనుకుంటే థ‌గ్‌ లైఫ్ లో ఈ రెండు నీరసం తెప్పించేలా ఉన్నాయి. దీనిపై ఇప్పుడు మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పెద్ది సినిమాకు సంగీత విషయంలో ఎలాంటి తేడా జరిగినా ? అది సినిమాపై గట్టి ప్రభావం చూపిస్తుందని వారు భావిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: