మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన కన్నప్ప సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శివుడిపై ఏ మాత్రం నమ్మకం లేని తిన్నడు శివ భక్తుడిగా ఎలా మారాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 174 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. టీ సిరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ట్రైలర్ విడుదయింది.

ట్రైలర్ కు మంచు విష్ణు యాక్టింగ్ స్కిల్స్ హైలెట్ గా నిలవగా  ప్రభాస్ కనిపించిన ప్రతి షాట్ వేరే లెవెల్ లో ఉంది. ట్రైలర్ లో ప్రభాస్ షాట్స్ సైతం అదిరిపోయాయి.  ఖర్చు విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడలేదని  ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.  ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ వస్తుండటం గమనార్హం .  కన్నప్ప మూవీ ఫస్ట్  డే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి.

యూట్యూబ్  లో కన్నప్ప ట్రైలర్ కింద ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు  తెగ వైరల్ అవుటున్నాయి.  దాదాపుగా 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కన్నప్ప ఈ నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. పోటీ లేకుండా విడుదల కావడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.  ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకోవాలని ట్రైలర్ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.  విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.

సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం రిపీట్ వాల్యూ ఉన్న సినిమా అవుతుందని  నెటిజన్లు  అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలకు సైతం పెద్దపీట వేశారు. అక్షయ్ కుమార్, కాజల్ తమ లుక్స్ తో ట్రైలర్ లో ఆకట్టుకున్నారు. మంచు విష్ణు డైలాగ్ డెలివరీ సైతం బాగుంది. హీరోయిన్ పాత్రకు డబ్బింగ్ సైతం బాగుంది. కన్నప్ప కమర్షియల్ రేంజ్ గురించి స్పష్టత రావాల్సి ఉంది.  ట్రైలర్ లో ప్రభాస్ డైలాగ్స్ బాగున్నాయి. కథ గురించి దాచకుండా ట్రైలర్ లో రివీల్ చేసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: