టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగార్జున సోలో హీరోగా సినిమా చేసి చాలా కాలమే అవుతుంది. ఆఖరుగా నాగార్జున సోలో హీరోగా నటించిన నా సామి రంగ సినిమా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగర్జున ఇప్పటివరకు సోలో హీరోగా ఏ మూవీ కి కమిట్ కాలేదు. కానీ ఇతర హీరోల సినిమాలలో మాత్రం కీలక పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. తాజాగా నాగార్జున , ధనుష్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర సినిమాలో కీలక పాత్రలో నటించాడు. అలాగే సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ మూవీ లో కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇకపోతే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర సినిమాను జూన్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ను నిర్వహించారు. ఆ ఈవెంట్ లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ తన అభిమానులకు అదిరిపోయే రేంజ్ గుడ్ న్యూస్ చెప్పాడు. నాగార్జున అభిమానులు ఎప్పటి నుండో ఆయన కెరియర్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న శివ మూవీ ని రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు. అందుకు తగినట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. తాజాగా కుబేర మూవీ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ ... శివ సినిమా 4K లో మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాడు. దీనితో నాగార్జున అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: