
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇటివలే జార్జియాలోని గ్రాండ్ లోకేషన్స్ లో కీలకమైన యాక్షన్ సీన్స్ ని షూట్ చేశారు.
రేపటి నుంచి ఆర్‌ఎఫ్‌సీలో 'అఖండ 2' కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణతో పాటు యూనిట్ అంతా పాల్గొంటున్నారు. సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. బాలకృష్ణ పుట్టినరోజుకు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో టీజర్ అదరగొట్టింది. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు.
టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సంగీత సంచలనం S థమన్ సంగీతం అందిస్తున్నారు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ C రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎడిటర్ తమ్మిరాజు. AS ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు