కోలీవుడ్ సీనియర్ దర్శకుడు ఏఆర్ . మురుగదాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గజిని - స్టాలిన్ - సర్కార్ - దర్బార్ - సెవెంత్ సెన్స్ - రమణ - స్పైడర్ లాంటి సినిమాలు కు దర్శకత్వం వహించిన ఆయన తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఏఆర్ మురుగదాస్ మార్కెట్ మరింత డౌన్ అయినట్లు అయింది. ప్రస్తుతం మురుగదాస్ శివ కార్తికేయన్ హీరో గా మదరాశి సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఐదు న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మురుగుదాస్ ఇంట్లో ఒక వేడుక జరిగింది. ఈ వేడుకలో మురుగుదాస్ త‌న‌లోని మరో కోణాన్ని తన అభిమానులకు పరిచయం చేశాడు.


తన కుటుంబంతో పాటు డ్యాన్స్ చేసి అందరిని ఆనందపరిచాడు. మురుగుదాస్ కుమార్తె హర్షిత హాఫ్ సారీ వేడుకలో సూర్య రెట్రో సినిమాలోని కన్నిమా పాటకి మురుగుదాస్ భార్య , కుమారుడు , కూతురు కలిపి వీర లెవెల్ లో డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మురుగదాసులోని ఈ టాలెంట్ ని చూసి కోలీవుడ్ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. చిత్ర పరిశ్రమలో చాలామంది దర్శకులు నటులుగా మారుతున్న విషయం తెలిసిందే. మరి మురుగుదాస్ కూడా నటుడు అవుతాడు అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.


ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: