తెలుగు సినీ ప్రేమికులు ఒక్కో సందర్భంలో ఒక్కో జోనర్ సినిమాలను అత్యధికం గా ఇష్ట పడుతూ ఉంటా రు . ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు పిరియాడిక్ సిని మాలను చాలా ఎక్కువ శాతం ఇష్ట పడుతూ వస్తున్నారు. దానితో మేక ర్స్ కూడా ప్రేక్షకుల ముందుకు పిరియాడిక్ జోనర్లో కొనసాగే సినిమా లను ఎక్కువ శాతం రూపొందిస్తున్నారు. అందులో భాగంగా మరి కొంత కాలంలో ప్రేక్షకుల ముందుకు రానున్న పిరియాడిక్ సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ పిరియాడిక్ జోనర్ సినిమాల్లో నటించలేదు. దానితో పవన్ ఫ్యాన్స్ కూడా పవన్ తన కెరియర్లో ఒక్క పిరియాడిక్ సినిమాలో అయినా నటిస్తే బాగుండు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాంటి సమయం లోనే పవన్ హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించబోతున్నారు. ఈ మూవీ పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల నుండి జరుగుతుంది. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ ఈమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి అనేక పిరియాడిక్ సినిమాలు రెడీ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: