- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ప్రస్తుతం టాలీవుడ్ లో సరైన సినిమాలు లేక సినిమాలు చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులకు రాక థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇప్పుడున్న పరిస్థితులలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే ప్రభుత్వాలు అధికారికంగా టికెట్ రేట్లు భారీగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కో టిక్కెట్ రేటు 800 నుంచి 1000 దాటుతోంది. ప్రభుత్వం అధికారికంగా టిక్కెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ ఉండడంతో పెద్ద సినిమాల విషయంలో నిర్మాతలు .. డిస్ట్రిబ్యూటర్లు కుమ్మ‌క్కు అయ్యి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుతున్నారు. ఫలితంగా థియేటర్లకు జనాలు రాని పరిస్థితి .ఇప్పుడు ఏ సినిమా అయినా వీకెండ్తో ధియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి.


ఎంతో పెద్ద సినిమా అయ్యి సూపర్ హిట్టు టాకు వస్తే తప్ప సోమవారం మార్నింగ్ షో కు జనాలు లేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్నా తెచ్చుకున్నా నష్టాలు తప్పని పరిస్థితి వచ్చేసింది. అయితే హైదరాబాదులో కేవలం 70 రూపాయలు టిక్కెట్టుతో ఒక సినిమా సింగల్ థియేటర్లో కోటి రూపాయల కొల్లగొట్టింది. ఆ సినిమా ఏదో కాదు తరుణ్ - రీచా - సాయికిరణ్ కాంబినేషన్లో తెర‌కెకెక్కిన నువ్వే కావాలి. రెండున్నర దశాబ్దాల క్రితం ఉషా కిరణ్ మూవీస్ బ్యాన‌ర్‌ఫై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకు కె విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. కోటి అందించిన పాటలు అప్పట్లో యువతను ఉర్రూత‌లూగించేసాయి.


హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓడియన్‌లో 70 రూపాయల టికెట్ తో ఏకంగా కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెంచిన చాలా సినిమాలకు కోటి రావడానికి గగనం అవుతున్న పరిస్థితి. కానీ 25 ఏళ్ల క్రితం అంత తక్కువ టిక్కెట్ తో సింగల్ థియేటర్లో కోటి రూపాయల కొల్లగొట్టిన ఘనత నువ్వే కావాలి కే దక్కుతుంది. ఇప్పటి టికెట్ రేట్ల ప్రకారం చూస్తే ఆ రోజుల్లో నువ్వే కావాలి ఓడియ‌న్‌ థియేటర్లో వసూలు చేసిన మొత్తం 10 కోట్లకు పైగా సమానం అని ట్రేడ్ వర్గాలు లెక్కలు క‌డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: