నాగార్జున కీ రోల్ లో నటించిన మొట్టమొదటి మూవీ కుబేర. మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు  మరి ఇంతకీ నాగార్జున ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. ఈ మూవీలో ధనుష్ హీరోగా చేశారు.ఇక ఈ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో ఎన్నో ప్రశ్నలు నాగార్జున కి తలెత్తాయి.. ధనుష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి నాగ్ మాట్లాడుతూ.. నేను చాలా రోజులుగా కథ బాగుంటే మల్టీ స్టారర్స్ చేస్తున్నాను. అలా కుబేర మూవీ కూడా చేశాను.

అలాగే కుబేర సినిమాలో ఒక కొత్త పాయింట్ ఉంది. రిచ్, మిడిల్ క్లాస్,పావర్టీఈ మూడు సొసైటీల క్లాస్ గురించి ఈ మూవీలో వివరంగా చెప్పారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్గా తీశారు డైరెక్టర్. ఇందులో హీరో హీరోయిన్ అనేది ఏమి లేదు.ప్రతి ఒక్కరి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది.అలాగే నాగార్జున రజినీకాంత్ కూలి మూవీ గురించి మాట్లాడుతూ.. ఇందులో నాది ఫుల్ లెన్త్ విలన్ పాత్ర అని చెప్పారు. అంతేకాకుండా మీ ఇమేజ్ కి తగ్గట్టు కథ మారిస్తే ఎలా ఉంటుంది అని యాంకర్ అడడగా.. అలా రాస్తే కథ చెడిపోతుంది.సినిమా బాగా రాదు అని ఆన్సర్ ఇచ్చారు.

ఇక రీమేక్స్ గురించి మాట్లాడుతూ.. ఓటిటి అందుబాటులోకి వచ్చాక రీమేక్స్ చేయడంలో అస్సలు పాయింట్ లేదు అని స్పందించారు. ఇక బిగ్ సినిమా గురించి మాట్లాడుతూ.. నా దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమాని అని ఏమీ లేదు. కథ బాగుంటే కామెడీ పాత్రలో నటించడానికి కూడా రెడీగా ఉంటాను. బిగ్ సినిమా అనే కాన్సెప్ట్ నా మైండ్ లో ఉండదు. పెయిడ్ ప్రమోషన్స్ నాకు అస్సలు నచ్చవు. అదో తలకాయ నొప్పి. ఇలాగే హ్యాపీగా ఉన్నాను. నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో రాణిస్తున్నాను.ఇంతకంటే ఇంకేం కావాలి.

ఇక సోషల్ మీడియా అనేది ఓ మాన్ స్టర్ అని, దానికి నేను చాలా దూరంగా ఉంటాను అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. అలాగే పాన్ ఇండియా సినిమాల గురించి స్పందిస్తూ.. పాన్ ఇండియా అనేది చాలా కష్టం అని, అన్ని సినిమాలు ఆ రేంజ్ కు సరిపోవు అంటూ మాట్లాడారు. ఇక తన నెక్స్ట్ మూవీ గురించి నాగార్జున మాట్లాడుతూ..నా 100వ సినిమా గురించి ప్రస్తుతం కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో పనులు జరుగుతున్నాయి అంటూ కుబేర మూవీ ప్రమోషన్స్ లో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: